గత ప్రభుత్వపు విధ్వంసాలను .. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న తీరును ప్రజలు గమనించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఈరోజు నగరంలో వివిధ ప్రాంతాలలో అన్నా క్యాంటీన్ లను పునఃప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజలు తమ ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు, ప్రత్యేక దినాలకు అన్న క్యాంటీనలో డోనార్లుగా మారి అతి తక్కువ ఖర్చుతో వేలాది మంది ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాల”ని పిలుపునిచ్చారు.
ప్రతీరోజూ నగరంలో ఉన్న మూడు అన్నా కాంటీన్లలో 4500 మందికి కేవలం రూ.5 రూపాయలకే ఆకలి తీర్చే కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది అని, త్వరలో మరో మూడు ప్రాంతాలలో కౌంటర్లు ప్రారంభించేలా మంత్రి నారాయణ నుండి హామీ లభించింది అని.. మరో రెండు మూడు నెలల్లో అవి ప్రారంభిస్తాం అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలివే
- ప్రభుత్వ జనరల్ హాస్పిటల్
- క్వారీ మార్కెట్ సెంటర్
- గోకవరం బస్టాండ్ సెంటర్
రాజమండ్రి నగరంలో జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారితో కలిసి 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు. (ఫోటోలు)