సైన్సు పరిశోధనల్లో సృజనాత్మక అన్వేషణ అనే అంశంపై వారం రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాపాక డేవిడ్ కుమార్ శనివారం తెలిపారు. గీతం యూనివర్సిటీ, ఆర్ట్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 26 వరకు వర్క్ షాప్ జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన శనివారం విడుదల చేశారు.