రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్ లు, గ్శానిటరీ సూపర్వైజర్ లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టి నప్పటి నుండీ మెయిన్ రోడ్, ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాల్లో రాత్రి పూట శానిటేషన్ ప్రక్రియ ప్రారంభించామని, అది సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇకపై మరిన్ని ప్రాంతాలకు రాత్రి పూట శానిటేషన్ ప్రారంభిస్తామన్నారు. రాత్రి పదిన్నర నుండి ఉదయం నాలుగు గంటల వరకూ జరుగుతున్న ఈ పద్దతి వల్ల జన జీవనానికి ఏ విధమైన అసౌకర్యం కలుగదు అన్నారు. కొన్నిఫ్లోర్ పాయింట్స్ వద్ద బయట ఎక్కువ చెత్త కనిపిస్తోందని, ప్లాస్టిక్ కవర్లలో రోడ్ మీద వేసేస్తున్నారన్నారు. కనుక అలాంటి పాయింట్లలో ప్రజలు ఎవరూ కవర్ల లో చెత్త వేయకుండా పెయింటింగ్లు వేయడం గానీ పూల కుండీలు ఏర్పాటు చేయడం గానీ చేయాలన్నారు. ప్రతి ఇంటి నుండీ నిర్దేశించిన డస్ట్ బిన్లలో, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి, చెత్త సేకరణ సిబ్బంది కి విధిగా అందించేలా చూడాలన్నారు. నగర పౌరులు ఈ విషయం లో తమ పూర్తి సహకారాన్నివ్వాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్ హెచ్ వో డాక్టర్ వినూత్న, ఎస్. ఎస్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.