Drunk and Drive: రాజమండ్రిలో మద్యం తాగి వాహనాలు నడిపే 16 మందిపై కేసులు

రాజమండ్రిలో ఈ నెల 13, 14 తేదీల్లో పోలీస్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే 16 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా బుధవారం వారిని రాజమండ్రి ఒకటో ప్రత్యేక జేబీఎస్ కోర్టులో హాజరు పర్చగా 13 కేసుల్లో నిందితులకు రూ. 14 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే మూడు కేసుల్లో ముగ్గురికి మూడురోజుల సాధారణ జైలు, రూ. 500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Rate this post