Rajahmundry Citizen Shows IAS: సివిల్స్ లో సత్తా చూపిన రాజమండ్రి యువకుడు

సివిల్స్ లో రాజమహేంద్రవరం కు చెందిన యువకుడు ప్రతిభ కనబరిచారు. ఆల్ ఇండియా సివిల్ ర్యాంక్ 99 సాదించాడు. భారతదేశంలోనే అత్యున్నత విద్య లో రాజమహేంద్రవరం కు చెందిన యువకుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగుర వేశాడు. నగరానికి చెందిన తరుణ్ పట్నాయక్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్ పరీక్షలు 99వ ర్యాంకు సాధించి సాధించాడు. రాజమహేంద్రవరం ఎల్ఐసీలో క్లర్కుగా పనిచేస్తున్న రవి కుమార్ పట్నాయక్, వైజాగ్ ఫుడ్స్ లో డైరెక్టర్ గా పని చేస్తున్న శారదా రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడైన తరుణ్ పట్నాయక్ మొదటినుంచి విద్యలో ప్రతిభ చూపించేవాడు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు జస్వీర్ ఉన్నత పాఠశాలలోను , ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కే. కే. గౌతమ్ స్కూలోను , ఇంటర్మీడియట్ కే. కే. ఆర్ చైతన్య రామన్ భవన్ లో విద్యనభ్యసించారు. మెకానికల్ ఇంజనీరింగ్ ను ఐ. ఐ. టి, గోహతి లో చదివారు. ఈ ఏడాది నిర్వహించిన సివిల్స్ పరీక్షలో దేశవ్యాప్తంగా 99 వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రి రవి కుమార్ పట్నాయక్ చేస్తున్న సేవాకార్యక్రమాల ద్వారా స్పూర్తి పొందిన తరుణ్ పట్నాయక్ ప్రజలకు సేవలు చెయ్యాలని కలలు కనేవారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం చదువు కోవడాని కేటాయించేవారు. ఎలాగైనా సివిల్స్ సాదించాలనే లక్ష్యం తో ఢీల్లీలో శిక్షణ పొంది 2022 దేశ వ్యాప్తంగా జరిగిన సివిల్స్ లో జరిగిన పరీక్ష లలో 99 వ ర్యాక్ సాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారు. తరుణ్ పట్నాయక్ సివిల్స్ లో ర్యాక్ సాదించడం పట్ల రాజానగరం ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు జక్కంపూడి రాజా , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయ లక్ష్మీ , తోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Rate this post