టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా ఈతలపాటి కృష్ణ

టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా ఈతలపాటి కృష్ణ ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం రాజమండ్రిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Rate this post